భారత్‌లో కొత్త క‌రోనా మ‌ర‌ణాలు ఆ రాష్ట్రాల్లోనే..!

దేశంలో క‌రోనా ఉధృతి ఆగ‌డం లేదు. తాజాగా 86,961 కేసులు, 1130 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులు, మ‌ర‌ణాల్లో ఎక్కువ కేవ‌లం 10 రాష్ట్రాల్లోనే ఉంటున్నాయ‌ని లెక్క‌లు చెపుతున్నాయి. నిన్న కొత్త కేసుల్లో 86 శాతం కేవలం ఈ 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మ‌ర‌ణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 455 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (101), ఉత్తర్‌ప్రదేశ్ (94), పశ్చిమబెంగాల్‌ (61), తమిళనాడు (60), ఆంధ్రప్రదేశ్‌ (57), పంజాబ్‌ (56), దిల్లీ (37), హరియాణా (29), మధ్యప్రదేశ్‌ (27)  ఉన్నాయి.

 

ఇక ప్ర‌స్తుతం దేశంలో 10 ల‌క్ష‌ల‌కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ద‌క్షిణాదిలో తెలంగాణ‌, ఏపీ, క‌ర్నాట‌క‌లో ఎక్కువుగా కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

Leave a comment