కంగ‌నాకు జెనిట‌ల్స్ చూపించిన ఆ స్టార్ హీరోలు… ఇలా కూడా వేధించారా..!

బాలీవుడ్‌లో ఏం జ‌రిగినా ఆ సంఘ‌ట‌న‌కు త‌న అనుభ‌వాలు ముడెట్టేస్తోంది కంగ‌నా ర‌నౌత్‌. కొద్ది రోజులుగా మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ ఆమె న్యూసే హైలెట్‌. తాజాగా హీరోయిన్ పాయ‌ల్ ఘోష్ త‌న‌ను ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ లైంగీకంగా వేధించాల‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే కంగ‌న పాయ‌ల్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. అనురాగ్‌ను అరెస్టు చేయాల‌ని కూడా డిమాండ్ చేసింది.

 

ఈ క్ర‌మంలోనే త‌న‌కు అల‌వాటైన రీతిలోనే బాలీవుడ్ స్టార్ హీరోల‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. కొంద‌రు హీరోలు త‌న‌ను సెక్సువ‌ల్‌గా వేధించార‌న్న కంగ‌నా.. షూటింగ్ స్పాట్‌ల‌లోనో లేదా ప్రైవేట్ పార్టీల‌లోనో కొంద‌రు స్టార్ హీరోలు త‌న‌కు జెనిట‌ల్స్ చూపించార‌ని కంగ‌నా ట్వీట్ చేసింది. వ్యాన్‌లో ఉన్న‌ప్పుడు స‌డెన్‌గా త‌లుపులు మూసేసి కొంద‌రు హీరోలు జెనిట‌ల్స్ చూపించార‌ని కంగ‌న చెప్పింది.

 

అయితే ఆ స్టార్ హీరోల పేర్లు మాత్రం ఆమె బ‌య‌ట పెట్ట‌లేదు. పాయ‌ల్‌కు మ‌ద్ద‌తుగా అనురాగ్‌పై విరుచుకు ప‌డిన కంగ‌న త‌న విష‌యంలో అలా చూపించిన హీరోల పేర్లు ఎందుకు చెప్ప‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. త‌న‌కు తాను డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్‌గా చెప్పుకునే కంగ‌న ఈ విష‌యంలో పేర్లు ఎందుకు దాస్తుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా కంగ‌న చెపుతోన్న వేధింపుల్లో ఇవి కొత్త త‌ర‌హా వేధింపులే అనాలి.

Leave a comment