ఒక‌ప్ప‌టి మెగాస్టార్ హీరోయిన్ మీకు గుర్తుందా… ఎవ‌రో తెలుసా..!

తెలుగులో గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు టాప్ హీరోల ప‌క్క‌న న‌టిస్తున్నారు.. వెళుతున్నారు. అయితే వీరిలో కొంద‌రికి మాత్ర‌మే గుర్తింపు వ‌స్తుండ‌గా.. చాలా మంది తెర‌మ‌రుగై పోతున్నారు. ఈ లిస్టులోనే మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న న‌టించిన ఓ హీరోయిన్ కూడా ఉంది. 2001లో అల్లు అర‌వింద్ నిర్మాత‌గా సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా డాడీ. చిరు హీరోగా సిమ్రాన్‌, ఆషిమా భ‌ల్లా హీరోయిన్లుగా న‌టించిన  సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కింది.

 

ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా న‌టించిన అషిమా అస్సాంలో పుట్టి పెరిగింది. చిన్న‌ప్పుడు చ‌దువుకున్న స‌మ‌యంలోనే న‌ట‌న‌పై ఆస‌క్తితో అనేక ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించిన ఆమె ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో ప్యార్ జింద‌గీ హై సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత రెండో ప్ర‌య‌త్నంగా చిరు ప‌క్క‌న డాడీ సినిమాలో చేసింది. ఆ త‌ర్వాత వేణు హీరోగా వ‌చ్చిన చెప్ప‌వే చిరుగాలి సినిమాలో న‌టించింది.

 

అయితే ఆ త‌ర్వాత ఆమెకు ఇక్క‌డ ఛాన్సులు లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్క‌డ హిందీ సీరియ‌ల్స్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో నాలుగు సీరియ‌ల్స్ ఉన్నాయి. ఆమె తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో మొత్తం 11 సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ఆమె అస్సాంలోనే ఉంటూ సీరియ‌ల్స్ చేస్తోంది.

Leave a comment