ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోట‌ల్లో టూరిస్ట్ గైడ్‌పై గ్యాంగ్ రేప్‌… !

దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌హిళల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ఓ వైపు క‌రోనా అక్క‌డ విల‌య తాండ‌వం చేస్తోన్నా కూడా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, లైంగీక వేధింపులు, దాడులు ఆగ‌డం లేదు. తాజాగా ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో ఓ గ‌దిలో ఓ మ‌హిళా టూరిస్ట్ గైడ్‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింద‌న్న వార్త‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఓ 27 ఏళ్ల యువ‌తి టూరిస్ట్ గైడ్‌గా ప‌ని చేస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే ఆమె ఫైవ్ స్టార్ హోట‌ల్లో ఉన్న‌ప్పుడు ఆ హోట‌ల్లోనే ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు ఆమెపై క‌న్నేశారు. ఆమె గ‌దిలోకి ప్ర‌వేశించి ఆ ఇద్ద‌రు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్టు ఆమె ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలోనే బాధితురాలు సమీప పోలీసు స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ఢిల్లీలో మ‌హిళ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని మ‌హిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Leave a comment