Newsమ‌హిళా ఎస్ఐకు జ‌డ్జి ఐ ల‌వ్ యూ... మిస్ యు డియ‌ర్‌...

మ‌హిళా ఎస్ఐకు జ‌డ్జి ఐ ల‌వ్ యూ… మిస్ యు డియ‌ర్‌ మెసేజ్‌లు…

ఓ మ‌హిళా ఎస్‌.ఐకు ఓ జ‌డ్జి నుంచి ప్రేమ సందేశాలు వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌ని ఆ మ‌హిళా ఎస్‌.ఐ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే జ‌డ్జి మాత్రం త‌న‌కు అలాంటివేం తెలియ‌వు మొర్రో మా ఇంటి ప‌నిమనిషి ఈ మెసేజ్‌లు పంపింద‌ని వాపోతున్నారు. గుజ‌రాత్‌లోని అమ్రేలి జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. అమ్రేలి జిల్లాలోని రాజుల పట్టణానికి చెందిన అదనపు న్యాయమూర్తి అర్ధ‌రాత్రి వేళ స్థానిక మ‌హిళా ఎస్‌.ఐకు ఐ ల‌వ్ యూ అన్న సందేశం పంపారు.

ఆయ‌న మొబైల్ నుంచి గుడ్ మార్నింగ్, మిస్ యు డియర్, లవ్ యూ టూ అంటూ సందేశాలను మహిళ ఎస్ఐకి పంపారు. ఉద‌యం ఈ మెసేజ్‌లు చూసుకున్న ఆమె గుర్తు తెలియ‌ని నెంబ‌ర్ నుంచి మెసేజ్ రావ‌డంతో ఆ నెంబ‌ర్‌కు ఫోన్ చేసి ఎవ‌రు మాట్లాడుతున్నార‌ని అడ‌గగా తాను సెషన్ కోర్టు అదనపు న్యాయమూర్తిని అని సమాధానం వచ్చింది. రాత్రి త‌న ఫోన్‌కు ఎందుకు మెసేజ్ పెట్టార‌ని ఆమె నిల‌దీసింది.

ఆ న్యాయ‌మూర్తి మాత్రం తాను అలాంటి సందేశాలు పంప‌లేద‌ని చెప్పింది. త‌న ప‌నిమ‌నిషి ఆ ప‌ని చేసి ఉంటుంద‌ని చెప్పినా ఆ మ‌హిళా ఎస్‌.ఐ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని ఆ మహిళా ఎస్ఐ అధికారులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news