Gossipsఎన్టీఆర్‌తో గేమ్స్ ఆడితే ఎలా బాసు...!

ఎన్టీఆర్‌తో గేమ్స్ ఆడితే ఎలా బాసు…!

త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి లాంటి ప్లాప్ ఇచ్చాక ఎన్టీఆర్ డేర్ చేసి అర‌వింద స‌మేత ఆఫ‌ర్ ఇచ్చాడు. ఆ సినిమాతో పుంజుకున్న త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పురంలో సినిమాతో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. దీంతో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఎన్టీఆర్‌తో సినిమాకు రెడీ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ అయిన వెంట‌నే వ‌చ్చే క్రేజ్‌తో సినిమా తీస్తే త‌న‌కు మ‌రింత ప్ల‌స్ అవుతుంది అన్న‌దే త్రివిక్ర‌మ్ ప్లాన్. అయితే ఇప్పుడు క‌రోనా రావ‌డంతో త్రివిక్ర‌మ్ డైల‌మాలో ప‌డ్డాడు.

 

ఆర్ ఆర్ ఆర్ ఎప్ప‌ట‌కి కంప్లీట్ అవుతుందో తెలియ‌డం లేదు. మ‌రో యేడాది ప‌ట్టొచ్చ‌న్న టాక్ ఇప్పుడు త్రివిక్ర‌మ్‌ను ఆందోళ‌న‌లో ప‌డేస్తోంది. అంత టైం వేస్ట్ చేసుకోవ‌డం కంటే ఈ లోగా వెంకీతో ఓ సినిమా చేసేస్తే పోలా అన్న‌ది త్రివిక్ర‌మ్‌, హారిక వాళ్ల ప్లాన్ అట‌. ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా చేసుకోండ‌న్న మాట వ‌స్తుందేమో ? అని  వీళ్లు చూస్తున్నార‌ట‌. ఈ మ‌ధ్య‌లోనే హారిక వాళ్లు రామ్‌చ‌ర‌ణ్‌ను కూడా క‌లిశారంటున్నారు. యేడాది గ్యాప్ ఉంటే ఈ లోగా త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా ప్లాన్ చేసేయాల‌ని ఉత్సాహంతో ఉన్నారు.

 

ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు.. ఈ లోగా త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా చేయ‌డం అంటే మ‌ళ్లీ ఎన్టీఆర్ సినిమాకు వ‌చ్చేస‌రికి అంతా కంగారు కంగారుగా ఉంటుంది. అది ఎన్టీఆర్‌కు ఇష్టం లేద‌ట‌. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు త్రివిక్ర‌మ్‌తో ట‌చ్‌లో ఉంటూ త‌న సినిమా డైలాగ్ వెర్షన్ విష‌యంలో చ‌ర్చిస్తూనే ఉన్నాడ‌ట‌. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పార్ట్ అయితే ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు.. అప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాకు వెళ్లిపోవ‌చ్చు.

 

 

ఈ లోగా త్రివిక్ర‌మ్ మ‌రో ప్రాజెక్టు చేస్తే ఎన్టీఆర్ కొన్ని రోజులు ఖాళీగా ఉండాలి. ఏదేమైనా హారిక వాళ్లు, త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ సినిమా లేట్ అవుతుంద‌ని కాస్త కంగారు ప‌డ‌డంతో పాటు ఈ లోగా మ‌రో ప్రాజెక్టు చేయాల‌ని ఆతృత‌తో ఉండ‌డం క‌రెక్ట్ కాద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news