బిగ్‌బాస్ హౌస్‌లోకి మ‌రో అల్ల‌రి న‌రేష్ హీరోయిన్‌.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ…!

మొత్తానికి మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చే టైంకు షోను బాగానే ర‌క్తిక‌ట్టిస్తున్నాడు బిగ్‌బాస్‌. ఒక్కొక్క‌రి ముసుగులు తొల‌గించ‌డంతో అస‌లు సిస‌లు గేమ్ ఆడుతున్నారు. ఇప్ప‌టికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్ద‌రిలో అవినాష్ స్టార్‌మా యాజ‌మాన్య న‌మ్మ‌కాన్ని నిల‌బెట్ట‌డాని చెప్పొచ్చు. ఇక కుమార్‌సాయి విష‌యానికి వ‌స్తే ప్రేక్ష‌కులు, స్టార్‌మా యాజ‌మాన్యాన్ని తీవ్రంగా నిరాశ ప‌రుస్తున్నాడు. అస‌లు కుమార్ సాయి ఇప్ప‌ట‌కి కూడా గేమ్లో ఇన్వాల్ అయిన‌ట్టు లేడు.

 

ఇక ఇప్పుడు మ‌రో హీరోయిన్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే హౌస్‌లో అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ మోజాల్ గ‌జ్జ‌ర్ ఉండ‌గా.. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ ప‌క్క‌న జంప్ జిలానీ సినిమాలో న‌టించిన‌ హీరోయిన్ స్వాతి దీక్షిత్ మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌. మ‌రోవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వ‌డంతో బిగ్‌బాస్ రేటింగ్‌లు డౌన్ అవుతున్నాయ‌ట‌.  ఈ క్ర‌మంలోనే ఇప్పుడు స్వాతీని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హీరోయిన్‌ను ప్ర‌వేశ పెట్టాల‌నే ఎత్తుగ‌డ ప్రేక్ష‌కుల‌ను ఎంత వర‌కు బిగ్‌బాస్ వైపు తిప్పుతుందో ?  చూడాలి.

Leave a comment