గుంటూరులో కులాంత‌ర వివాహం… న‌ల్గొండ ప్ర‌ణ‌య్‌లా లేపేస్తాం అని వార్నింగ్‌

గుంటూరు నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ కలకలం రేపుతోంది. దిలీప్‌, సౌమ్య అనే ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు. నాటి నుంచి యువ‌తి త‌ల్లి దండ్రుల నుంచి యువ‌తి, యువ‌కుడు ఇద్ద‌రికి బెదిరింపులు వ‌స్తున్నాయి. యువ‌తి త‌ల్లి దండ్రులు యువ‌కుడికి ఫోన్ చేసి న‌ల్ల‌గొండ‌లో ప్ర‌ణ‌య్ విష‌యం నీకు గుర్తుందిగా… అంటూ చంపేస్తామ‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించార‌ట‌.

 

ప్ర‌ణ‌య్‌లా నిన్ను కూడా చంపేస్తాం అని వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు మంగళవారం దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లార‌ని దిలీప్ ఆరోపిస్తున్నాడు. దీంతో సౌమ్య కుటుంబసభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సౌమ్య కుటుంబసభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించ‌డంతో పాటు త‌నకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరాడు.

Leave a comment