అనంత‌లో ప్రియుడి మోజులో ఆ భార్య మామూలు ప్లాన్ వేయ‌లేదుగా.. చివ‌ర‌కు దాంతోనే…!

స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ సంబంధాలు మంట‌క‌లుస్తున్నాయి. ప‌రాయి వ్య‌క్తుల మోజులో ప‌డి ఎందో మంది భార్య‌లు, భ‌ర్త‌లు త‌మ వాళ్ల‌నే చంపుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం జిల్లాలో ప్రియుడి మోజులో ఓ భార్య త‌న భ‌ర్త‌నే చంపేసింది. జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాస్ చౌదరికి 9 సంవత్సరాల కింద సరిత అనే మహిళతో వివాహమైంది. ఈ దంప‌తుల‌కు ఏడేళ్ల బాబు ఉన్నాడు.

 

అయితే స‌రిత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా… విష‌యం తెలిసిన భ‌ర్త శ్రీనివాస్ ఆమెను మందిలించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు మ‌ద్యానికి బానిస అయ్యాడు. ఆదివారం మ‌ద్యం మ‌త్తులో వ‌చ్చిన భ‌ర్త వివాహేత‌ర సంబంధం విష‌య‌మై భార్య స‌రిత‌తో గొడ‌వ ప‌డ‌గా ఆమె ప‌ప్పు కాడ‌తో అత‌డి త‌ల‌పై కొట్ట‌గా అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు.

 

త‌ర్వాత భ‌ర్త‌ది ఆత్మ‌హ‌త్య అని న‌మ్మించేందుకు శ్రీనివాస్ శవాన్ని చెట్టుకు ఉరేసింది. శ్రీనివాస్ తండ్రి రామచంద్రప్ప త‌న కోడ‌లే ప్రియుడి మోజులో ప‌డి త‌న కుమారుడిని హ‌త్య చేసింద‌ని చెప్ప‌డంతో పోలీసులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment