మనదేశంలో ఏకంగా 19 రాష్ట్రాల్లో కండోమ్‌లను పురుషులు వాడట్లేదన్న విషయం తాజా సర్వేలో బయటకు వచ్చింది. 2000లో దేశంలో 38 శాతం మంది కండోమ్‌లు వాడి సురక్షిత శృంగారం చేయగా… అది ఇప్పుడు 24 శాతానికి పడిపోయింది. కండోమ్‌లతో పూర్తిగా శృంగార ప్రాప్తి అస్వాదించలేకపోతున్నామన్న కారణంతోనే వీటిని ఎక్కువ మంది వాడడం లేదట. తమకు శృంగారంలో మజా ఇవ్వని కండోమ్ కంటే జంటలు గర్భ నిరోధక మాత్రలు, కాపర్ టీ ఇంజెక్షన్లు ట్యూబెక్టమీ, వేసేక్టమీ పద్ధతులు అవలంభిస్తున్నారని సర్వే చెప్పింది.
అయితే ఇది సమాజానికి పెను ప్రమాదం లాంటిదే అని చెప్పాలి. కండోమ్ లేని శృంగారం వల్ల ఎయిడ్స్ లాంటి భయంకర వ్యాధులు ప్రబలి జీవితాన్ని చిదిమేస్తాయి. దేశంలో ఎయిడ్స్ రోగుల శాతాన్ని పెంచడానికి కారణమవుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పుడే మేల్కోకుంటే దేశంలో మళ్లీ ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరగడం ఖాయమే.
కేవలం మూడు, నాలుగు నిమిషాల భావప్రాప్తి కోసం ఎయిడ్స్ లాంటి ప్రమాదకర వ్యాధులు చుట్టుముట్టి ప్రాణాలు తీస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుంటే బాగుంటుంది.