ఎలిమినేష‌న్ సీక్రెట్ బ‌య‌ట పెట్టేసిన క‌రాటే క‌ల్యాణి

బిగ్‌బాస్‌లో క‌రాటే క‌ల్యాణి మొత్తానికి రెండో వారంలోనే ఎలిమినేష‌న్ అయిపోయింది. బాగా డామినేట్ చేస్తుండ‌డంతో ఆమె తొలి వారంలోనే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. అయితే ఆమె తొలి వారం నామినేష‌న్ కాక‌పోవడంతో సేఫ్ అవ్వ‌గా సూర్య‌కిర‌ణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆమె రెండో వారంలో సెల్ఫ్ నామినేష‌న్ అవ్వ‌గా ఆమెను బిగ్‌బాస్ ప్రేమికులు సేవ్ చేయ‌లేదు. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌ల్యాణి తాను ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చానో చెప్పారు.

 

తాను హౌస్‌లో ఏడుస్తుండ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చలేద‌ని.. అందుకే తాను త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని అన్నారు. ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అంద‌రూ త‌న‌కంటే 15 ఏళ్ల చిన్న‌వాళ్ల‌ని, వాళ్ల ఆలోచ‌నా విధానం, త‌న ఆలోచ‌నా విధానం వేర‌ని అన్నారు. ఇక హౌస్‌లో తాను ఉన్న‌న్ని రోజులు ఉన్నంత‌లో చేసి పెడుతున్నా కూడా త‌న‌ను జీరోను చేశార‌ని ఆమె వాపోయారు.

 

అలాంట‌ప్పుడు తాను హౌస్‌లోఉండ‌డం కంటే బ‌య‌ట‌కు రావ‌డ‌మే బెట‌ర్ అనుకుని… సెల్ఫ్ నామినేష‌న్ చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు క‌రాటే క‌ల్యాణి అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించారు.

Leave a comment