తన 15 ఏళ్ల కుమార్తెతో సహా హీరోయిన్ మిస్సింగ్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఆమె కోసం ఆమె బంధువులు, భర్త ఎన్నో చోట్ల వెతికినా కనపడకపోవడంతో చివరకు భర్త పోలీసులకు తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నర్మద ఓ సంచలనం. 1987లో చిన్న పూవే మేల్ల సినిమాతో హీరోయిన్గా నర్మద పరిచయం అయింది. ఈ సినిమాలో సిందూర పువ్వు’ ఫేమ్ రాంకీతో పాటు చంద్రముఖి ఫేమ్ ప్రభు హీరోలుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆమె ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం కావడంతో పాటు తమిళనాడులోని తారాపురానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు కాని ఆమె 15 ఏళ్ల కుమార్తెతో సహా కనిపించకుండా పోవడం.. భర్త ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో కలకలంగా మారింది.