డ్ర‌గ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయిన నటుడు

ఓ వైపు డ్ర‌గ్స్ కేసు అటు బాలీవుడ్ నుంచి ఇటు శాండ‌ల్‌వుడ్‌, టాలీవుడ్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినిమా ఇండ‌స్ట్రీల‌ను ఓ కుదుపు కుదుపుతోంది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్‌బ్యూరో అధికారులు  ఈ విష‌యంలో సీరియ‌స్‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే క‌న్న‌డ నాట‌ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాగిణి ద్వివేది, సంజ‌న గ‌ల్రానీల‌ను బెంగ‌ళూరులో అరెస్టు చేసి విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

 

ఇక వీరు చెప్పిన వివ‌రాల ఆధారంగా మొత్తం 15 మంది సెల‌బ్రిటీల‌కు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసులో రోజుకొకరి ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కేసు ఇంత సీరియ‌స్‌గా విచారిస్తోన్న స‌మ‌యంలోనే ఓ క‌న్న‌డ న‌టుడు డ్ర‌గ్స్ అమ్ముతూ అడ్డంగా దొరికిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వికాశ్ కుమార్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం నటుడు కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి డ్ర‌గ్స్ అమ్మే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా ప‌ట్టుకున్నారు.

 

బైక్‌పై వెళుతుండ‌గా.. అమ‌న్ శెట్టితో పాటు మ‌రో వ్య‌క్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ‌న్ ఎండీఎంఏ డ్ర‌గ్స్ విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. వీరికి ముంబై నుంచి డ్రగ్స్ వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని దర్యాప్తు కొనసాగుతోంద‌ని టాక్‌..!

Leave a comment