అందాల రాక్షసి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు నవీన్ చంద్ర. హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఈ బళ్లారి కుర్రాడి కోసం ఇంట్లో నుంచి బట్టలు సర్దేసుకుని వచ్చిన అమ్మాయిలు ఉన్నారట. నవీన్ చంద్ర తాజాగా మాట్లాడుతూ అందాల రాక్షసి రిలీజ్ అయిన తొలి రోజు నుంచే తనకు ఫోన్ కాల్స్ చాలా వచ్చాయని నవీన్ చెపుతున్నాడు. చాలా మంది అమ్మాయిలు ఫోన్లు చేయడం ఐ లవ్ యూ అని చెపుతుండడంతో నవీన్‌కు విసుగువచ్చి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడట.
మరీ దారుణంగా నవీన్ అండర్ వేర్ సైజ్ తెలుసుకుని కొందరు అండర్ వేర్లు బహుమతిగా పంపారని కూడా చెప్పాడు. ఒక అమ్మాయి బట్టలు సర్దుకుని, నగలు పట్టుకుని హైదరాబాద్ కూడా వచ్చేసిందట. సికింద్రాబాద్‌లో పలానా హోటల్లో తాను ఉన్నానని.. నువ్వు హోటల్‌కు రాకపోతే ఏం జరుగుతుందో అని బెదిరించిందని కూడా నవీన్ చెప్పాడు. ఆ రోజు యువతుల నుంచి నవీన్ ఈ రేంజులు క్రేజ్ తెచ్చుకున్నాడు.
తొలి సినిమాతోనే గుబురు గడ్డంతో పిచ్చ ప్రేమికుడుగా జీవించేసిన నవీన్ నటనకు మరింత పేరు వచ్చింది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాలో నవీన్ హీరోగా చేయాల్సింది.. అయితే దర్శకుడు అజయ్ భూపతితో కలిసి నిర్మాత ట్రై చేసి వదిలేశాడు. చివరకు ఆ సినిమా కార్తీకేయ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు.