Gossipsమ‌హేష్‌బాబు మూవీలో డ‌ర్టీ హీరోయిన్‌...

మ‌హేష్‌బాబు మూవీలో డ‌ర్టీ హీరోయిన్‌…

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కెరీర్లో 27వ సినిమాగా తెర‌కెక్కే ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ – జీఎంబీ ఎంట‌ర్టైన్‌మెంట్ – 14 రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక విల‌న్‌గా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అనిల్ క‌పూర్ పేరు ఫైన‌లేజ్ అవుతుందంటున్నారు.

 

ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే బ‌జ్ ఉన్న న్యూస్ ఒక‌టి స‌ర్కారు వారి పాట టీం ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌హేష్‌కు సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ ఉంద‌ట‌. ఎలాగూ పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే నేష‌న‌ల్ వైడ్ క్రేజ్ ఉన్న డ‌ర్టీ పిక్చ‌ర్ హీరోయిన్ విద్యా బాల‌న్‌ను ఈ క్యారెక్ట‌ర్ కోసం ట్రై చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం విద్యాతో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ట‌.

 

 

ఇక ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే అమెరికాలో ప్రారంభం కానుంది. దీని కోసం మహేష్ అండ్ టీమ్ స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళ్లనున్నారని సమాచారం. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్ కాగా థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news