బ్రేకింగ్‌: ప‌్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడికి క‌రోనా

క‌రోనా వైర‌స్ సినిమా, రాజ‌జ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను వ‌ద‌ల‌డం లేదు. తాజ‌గా టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా భారీన ప‌డ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని డాక్ట‌ర్లు నిర్దారించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక 65 ఏళ్ల వ‌య‌స్సులో త‌న‌కు క‌రోనా వ‌చ్చినా కూడా తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని సింగీతం తెలిపారు.

 

 

ఇక డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆయ‌న ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్లో ఉంటున్నారు. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఆయ‌న హోం ఐసోలేష‌న్లో ఉంటాన‌ని చెప్పారు. ఇక సింగీతం కొద్ది రోజులుగా ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 పేరుతో ఓ సినిమా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అలాగే స‌మంత ప్ర‌ధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా తీసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.