Moviesబిగ్‌బాస్‌లో నోయ‌ల్‌ను పెళ్లి చేసుకుంటాన‌న్న లేడీ కంటెస్టెంట్‌... !

బిగ్‌బాస్‌లో నోయ‌ల్‌ను పెళ్లి చేసుకుంటాన‌న్న లేడీ కంటెస్టెంట్‌… !

తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ఇప్పటికే రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌తో షో రెండో వారంలో కాస్త ర‌క్తిక‌డుతోంది. రెండో వారంలో కామెడీ డోస్ పెంచ‌డంతో షో కాస్త ర‌క్తిక‌డుతోంది. మంగ‌ళ‌వారం మార్నింగ్ ఎపిసోడ్లో దేత్త‌డి హారిక హాట్ హాట్‌గా షార్టు డ్రెస్సుల‌తో అంద‌రి దృష్టిని త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేసింది.

ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్యుల‌ను ఆట ప‌ట్టించేందుకు ర్యాప్ సింగర్ నోయ‌ల్‌ను తాను ప్రేమిస్తున్నాన‌ని.. తాను పెళ్లి చేసుకుంటాన‌ని దేత్త‌డి హారిక గంగ‌వ్వ‌ను అమ్మ‌మ్మా ఒప్పుకో అంటూ ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించింది. అమ్మ‌మ్మా అత‌డి ద‌గ్గ‌ర మ‌స్తు పైస‌లు ఉన్నాయి.. ప్రేమిస్తున్నాను.. ఒప్పుకో అని హ‌రిక గంగ‌వ్వ ద‌గ్గ‌ర మారాం చేసింది. పెళ్లై పిల్ల‌లు ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటావా ? అని గంగ‌వ్వ హారిక‌పై ఫైర్ అయ్యింది.

 

వెంట‌నే నోయ‌ల్ నిన్నే ప్రేమిస్తున్నా నువ్వు పెళ్లి చేసుకోక‌పోతే నీ పేరు రాసి చ‌చ్చిపోతాన‌ని అన‌గా గంగ‌వ్వ పోయి చావు అన‌డంతో ఒక్క‌సారిగా అక్క‌డ న‌వ్వుల‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది.  ఇక రెండో వారంలో మొత్తం 9 మంది ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news