తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ పూర్తిగా మార్చేసిన బాహుబలి సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి ఇద్దరు క్రేజీ హీరోలతో ఈ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో వచ్చే యేడాది అయినా వస్తుందా ? అన్న సందేహాలు ఉన్నాయి.
మరోవైపు భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు ఎక్కువ మందితో షూటింగ్ చేయాల్సి ఉండడంతో రాజమౌళి ఇప్పట్లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాను రు. 400 కోట్లతో నిర్మిస్తోన్న నిర్మాత దానయ్యకు ఇప్పుడు షూటింగ్ లేట్ అవ్వడం వల్ల మరో రు.100 కోట్లు ఖర్చు అదనం అవుతోందట. ఇప్పటికే వేసిన సెట్లను మెయింటైన్ చేయడంతో పాటు వాటికి అద్దెలు కడుతుండడంతో నిర్మాత దానయ్యకు ఖర్చు తడిసి మెపెడు అవుతోందని.. ఈ క్రమంలోనే షూటింగ్ లేట్ చేస్తోన్న రాజమౌళిపై పైకి చెప్పుకోలేకపోయినా తీవ్ర అసహనంతో ఉన్నాడని గుసగుసలు వస్తున్నాయి.
జనవరి 8న సినిమా వస్తే దానయ్యకు చాలా కలిసి వస్తుంది. అదే వచ్చే యేడాది కాకుండా ఏ 2022 సంక్రాంతికో సినిమా వస్తే భారీగా వడ్డీలు తడిసి మోపెడు అవుతాయి. మరి రాజమౌళి ఎప్పుడు షూటింగ్ ప్రారంభించి ? ఎప్పుడు ఫినిష్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ? ఎవరికి తెలియని పరిస్థితి.