Gossipsబిగ్‌బాస్ 4 రేటింగ్ ఢ‌మాల్‌... దెబ్బ‌కు మార్పులు చేసేశారుగా..!

బిగ్‌బాస్ 4 రేటింగ్ ఢ‌మాల్‌… దెబ్బ‌కు మార్పులు చేసేశారుగా..!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ గ‌త ఆదివారం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు సీజ‌న్లు ఒక ఎత్తు అయితే నాలుగో సీజ‌న్ ఒక ఎత్తు అనుకోవాలి. తొలి మూడు సీజ‌న్ల‌కు మంచి రేటింగులే వ‌చ్చాయి. నాలుగో సీజ‌న్‌కు తొలి రోజు నుంచే ఫ్యాన్స్ డీలా ప‌డిపోయారు. ఇక రెండు, మూడు ఎపిసోడ్ల‌కు కూడా అనుకున్న స్థాయిలో రేటింగ్ రావ‌డం లేద‌ట‌. ఇక కంటెస్టెంట్లు గురించి అంత ఫేమ‌స్ కాద‌ని.. వీక్ కంటెస్టెంట్లే ఎక్కువ మంది ఉన్నార‌న్న విమ‌ర్శలు కూడా వ‌స్తున్నాయి.

Bigg Boss Telugu 4: From most probable contestants to limited crew members  and pay cuts, all we know so far about the upcoming season | The Times of  India

పేరున్న కంటెస్టెంట్లు తెలిసిన వారు కాక‌పోవ‌డంతో షోకు ఎట్రాక్ష‌న్ కూడా లేదంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే షోపై రానున్న రోజుల్లో ఆస‌క్తి మ‌రింత‌గా త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న ఫీడ్‌బ్యాక్ బిగ్‌బాస్ టీంకు చేరిపోయింద‌ట‌. దీంతో ఈ షోను మ‌రింత‌గా ర‌క్తిక‌ట్టించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయంటున్నారు.

Bigg Boss 4 Telugu New Contestants who may enter the show - tollywood

ఈ నేప‌థ్యంలోనే రానున్న రోజుల్లో మ‌న‌కు బాగా తెలిసిన ఫేస్‌లే ఎంట్రీ ఇవ్వ‌నున్నాయ‌ట‌. మ‌రో ఇద్ద‌రు టాప్ కంటెస్టెంట్ల‌ను లోప‌ల‌కు పంపున్నార‌ట‌. అయితే వీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా ? లేదా ? స్పెష‌ల్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తారా ? అన్న‌ది చూడాలి. మ‌రి ఈ కొత్త ప్లానింగ్స్ అయినా కూడా బిగ్‌బాస్ రేటింగ్‌ను లేపుతాయేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news