తెలుగు జాతి గర్వించదగ్గ నటుల్లో ఒకరు అయిన దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు తొలి ఛాన్స్ ఎలా వచ్చింది ? ఆయన తెలుగు సినిమా చరిత్రంలో మకుటం లేని మహారాజుగా ఉన్నా కూడా ఆయనకు తొలి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు ఎవరు ? వెండితెరను ఏలేందుకు బీజం వేసిన ఆ అదృష్టం ఎలా తగిలిందో చూస్త ఆశ్చర్యం అనిపించకమానదు. ఏఎన్నార్ గుంటూరు జిల్లా తెనాలిలో ఓ నాటక ప్రదర్శనకు వెళ్లారు. అక్కడ నాటక ప్రదర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు నాగేశ్వరరావు నాటక బృందం చేరుకుంది.
వీరు రైలు ఎక్కుతుండగా అదే రైల్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉన్న ప్రతిభా సంస్థ ఘంటసాల బలరామయ్య చూసి దగ్గరకు పిలిచి ఊరు పేరు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. సినిమాల్లో నటిస్తావా ? అని అడిగారు. అదే సమయంలో ఆయన సీతారామ జననం సినిమాలో శ్రీరాముడు రోల్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బలరామయ్య దృష్టిలో పడిన నాగేశ్వరరావు ఆయన ఆహ్వానంతో ప్రముఖ దర్శకుడు దుక్కిపాటి మధుసూదన్ రావుతో కలిసి 1944 మే 8న చెన్నైలో అడుగుపెట్టారు.
బలరామయ్య గారు ఏఎన్నార్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. చివరగా మనం సినిమాలో తన కొడుకు నాగార్జున, తన మనవళ్లు చైతు, అఖిల్‌తో కలిసి నటించారు.