ట్రంప్‌కు ఎదురు తిరిగిన టిక్ టాక్‌

అమెరికాలో ఈ ఆదివారం నుంచి టిక్‌టాక్‌ను నిషేధించాల‌ని ట్రంప్ స‌ర్కార్ ఇప్ప‌టికే  ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ట్రంప్‌పై న్యాయ‌పోరాటానికి రెడీ అయ్యింది. ట్రంప్ పాల‌క‌వ‌ర్గంపై అక్క‌డ కోర్టులో దావా వేసింది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా యాప్‌పై నిషేధం విధించారని స్ప‌ష్టం చేసింది. ఇక ట్రంప్‌పై టిక్ టాక్ కోర్టుకు వెళ్ల‌డం ఇది రెండోసారి. ట్రంప్ నిర్ణ‌యం వాక్ స్వాతంత్య్రానికి వ్య‌తిరేకంగా ఉంద‌ని కూడా చెప్పింది.

భ‌ద్ర‌త‌, గోప్యం విష‌యంలో తాము పౌరుల ప్ర‌యోజ‌నాలు కాపాడుతున్నామ‌ని చెప్పినా, ఆధారాల‌ను ఇచ్చినా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని చెప్పింది. ఇక చైనా – అమెరికా మ‌ధ్య సాంకేతిక యుద్ధం రోజు రోజుకు బాగా ముదురుతోంది. చైనాపై గుర్రుగా ఉన్న ట్రంప్‌.. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. త‌మ దేశ పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం చైనా త‌స్క‌రిస్తున్నందునే ఈ రెండు యాప్‌ల‌పై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇక భార‌త్ ఎప్పుడో ఈ యాప్‌ను నిషేధించింది.

Leave a comment