అఫీషియ‌ల్‌: నితిన్‌కు విల‌న్‌గా ప‌వ‌న్ హీరోయిన్‌

బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధున్ రీమేక్‌ను తెలుగులో నితిన్ హీరోగా తెర‌కెక్కిస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో బాలీవుడ్‌లో ట‌బు చేసిన నెగిటివ్ రోల్ పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తారా ? అన్న‌దానిపై కొద్ది రోజులుగా క్లారిటీ లేక స‌స్పెన్స్ న‌డుస్తోంది. కొంత నెగిటివ్ ట‌చ్‌తో పాటు కాస్త బోల్డ్ క్యారెక్ట‌ర్‌గా ఉండే ఈ రోల్‌ను అక్క‌డ ట‌బు బాగా చేయ‌డంతో ఆమెకు మంచి మార్కులు ప‌డ్డాయి. తెలుగులో ఈ రోల్ కోసం ట‌బు, న‌య‌న‌తార‌, ర‌మ్య‌కృష్ణ ఇలా ప‌లువురు పేర్లు ప‌రిశీలించారు.

 

 

వీరంతా భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో చిత్ర యూనిట్ ఎవ‌రిని ఎంపిక చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డింది. ఎట్ట‌కేల‌కు  ఈ సినిమాలో ఆ నెగిటివ్ రోల్‌కు ఓ హీరోయిన్‌ను యూనిట్ ప్ర‌క‌టించింది. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ నెగిటివ్ +  బోల్డ్ రోల్లో నటిస్తున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇక నితిన్ వీరాభిమాని ప‌వ‌న్ ప‌క్క‌న కెమేరామెన్ గంగ‌తో రాంబాబు సినిమాలో న‌టించిన ఈ మిల్కీబ్యూటీ నితిన్‌కు విల‌న్‌గా ఎలా మెప్పిస్తుందో ?  చూడాలి.

Leave a comment