ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే బిగ్‌బాస్ 4 విన్న‌ర్ ఎవ‌రో తెలుసా..!

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4 అంచ‌నాల‌కు భిన్నంగా సాగుతోంది. మొత్తం హౌస్‌లోకి 16 మంది కంటెస్టెంట్ల‌తో పాటు ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇద్ద‌రు ఎలిమినేట్ అయ్యారు. తొలి వారం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్‌, రెండో వారం క‌రాటే క‌ల్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో వారం నాగార్జున డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని.. రెండో కంటెస్టెంట్‌గా దేత్త‌డి హారిక‌ను ఎలిమినేట్ చేయించాడు. పైగా హౌస్‌లో గ‌త వారం నామినేష‌న్లో లేని కంటెస్టెంట్ల‌తో ఓటింగ్ పెట్టించి మ‌రీ ఆమెను ఎలిమినేట్ చేశాడు.

 

 

అయితే ఆమె హౌస్ నంచి బ‌ట‌య‌కు వ‌స్తోన్న టైంలో అదంతా ఫేక్ ఎలిమినేష‌న్ అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే గ‌త సీజ‌న్లో ఎలిమినేట్ అయిన రాహుల్‌ది కూడా ఫేక్ ఎలిమినేష‌న్ అయ్యింది. ఆ వెంట‌నే రాహుల్ తిరిగి హౌస్‌లోకి వ‌చ్చాడు. అత‌డు విన్న‌ర్ అయ్యాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ సీజ‌న్లో దేత్త‌డి హారిక విన్న‌ర్ అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఈ సెంటిమెంట్ నిజ‌మ‌వుతుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

Leave a comment