బిగ్‌బాస్‌కు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు… హ‌ర్ట్ అయిన రాజ‌శేఖ‌ర్‌

మొత్తానికి బిగ్‌బాస్ తాను ఉన్నాన‌న్న ఉనికి చాటుకున్నాడు. నియ‌య నిబంధ‌న‌లు పాటించ‌నందుకు ఇంటి స‌భ్యుల‌కు శిక్ష వేశాడు. ఇక శుక్ర‌వారం ఎపిసోడ్లో అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ రెండు టీమ్‌లుగా విడిపోయి నువ్వానేనా అన్న రీతిలో కామెడీ పండించారు. ఈ రెండు టీమ్‌ల‌కు స‌మానంగా ఓట్లు ప‌డ్డాయి. అయితే గంగ‌వ్వ వేసిన ఓటుతో అవినాష్ టీమ్ గెలిచింది.

Bigg Boss Telugu 4: Popular playback singer-TV host Noel Sean to  participate in the upcoming season? - Times of India

అమ్మ రాజ‌శేఖ‌ర్ ఒక్క‌సారిగా హ‌ర్ట్ అయ్యాడు. చివ‌ర‌కు బిగ్‌బాస్ ఇద్ద‌రు గెలిచార‌న్నట్టుగా రెండు రీల్ జ్యూస్ బాటిల్స్ పంపి రాజ‌శేఖ‌ర్‌ను కాస్త కూల్ చేశాడు. ఇంత‌లోనే దేవి మీరు అంద‌రూ త‌న‌ను కావాల‌ని దూరం పెడుతున్నార‌ని.. మీరంద‌రూ ఏదేదో మాట్లాడుకుంటున్నార‌ని చెప్ప‌గా లాస్య అలాంటిది లేద‌ని ఎంత‌ చెప్పినా ఆమె చెవికెక్కించుకోలేదు. ఇక బాగా ప్ర‌స్టేష‌న్‌కు గురైన నోయ‌ల్ ఈ వారం తాను హౌస్ నుంచి వెళ్లిపోతాన‌ని చెప్పాడు.

Bigg boss tidbits: Singer Noel's comments on Sreemukhi backfired

ఇక రెండో కెప్టెన్‌గా నోయ‌ల్ ఎంపిక‌య్యాడు. తొలి వారం కెప్టెన్‌గా లాస్య ఉన్న సంగ‌తి తెలిసిందే. కెప్టెన్సీ కోసం నోయ‌ల్‌, మెహ‌బూబ్‌, క‌ళ్యాణి, అభిజిత్‌ పోటీ ప‌డ్డారు. అందరూ ఏకాభిప్రాయంతో నోయ‌ల్‌ను రెండో కెప్టెన్‌గా ఎన్నుకున్నారు.

Leave a comment