రాజకీయాలకు, సినిమా రంగానికి ఉన్న లింకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు సినిమా రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. ఇదంతా కామన్. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలితే ఇందుకు ఉదాహరణ. అయితే ఓ టాప్ పొలిటిషీయన్ కొడుకు మోడలింగ్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తెలుగులో కూడా తనదైన ముద్రవేశాడు.
తెలుగులో సానా యాదిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంపంగి సినిమాతో హీరోగా నటించాడు దీపక్. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమాలో రవితేజ స్నేహితుడి పాత్రలో నటించాడు దీపక్. దీపక్ ఎవరో కాదు ఓ బీజేపీ కీలక నేత కుమారుడే. ఇతడు ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దీపక్ తండ్రి స్వింధర్‌జిత్ సింగ్. బీజేపీలో ముఖ్య నాయకుడు. స్వింధర్ ఢిల్లీ ఉపమేయర్‌గా పనిచేశాడు. దీపక్ చదువుకున్న టైంలోనే మోడలింగ్ చేశాడు.
ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో సంపంగి, భద్ర, నీతోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, కింగ్, మిత్రుడు, అరుంధతి సినిమాల్లో నటించాడు. ఏదేమైనా ఢిల్లీకి చెందిన దీపక్ తెలుగులో తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత హీరోగా చేసినా బ్రేక్ రాకపోవడంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు.