డ్ర‌గ్ కేసులో ముగ్గురు టాప్ హీరోయిన్ల పేర్లు లీక్‌… !

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ కేసు చివ‌ర‌కు డ్ర‌గ్ వైపున‌కు మ‌ళ్లింది. సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారిస్తోన్న కొద్ది ఈ కేసు అనేక ర‌కాలుగా మలుపులు తిరుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ జాబితాలో ముగ్గురు టాప్ బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీపికా ప‌దుకునే, శ్ర‌ద్ధ‌క‌పూర్, సారా అలీఖాన్ వంటి హీరోయిన్ల పేర్లు ఈ వ్య‌వ‌హారంలో వినిపిస్తున్నాయి.

 

 

దీపిక‌, శ్ర‌ద్ధ‌ల‌కు డ్ర‌గ్స్ అందిన‌ట్టుగా కొన్ని ఆధారాలు డ్ర‌గ్ పంపిణీదారులు చెప్పిన‌ట్టుగా కూడా జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే దీపిక‌, శ్ర‌ద్ధ‌ల‌కు డ్ర‌గ్స్ ఇచ్చిన పంపిణీదారులు వారి పేర్లు నేరుగా చెప్ప‌కుండా కొన్ని కోడ్స్ ఆధారంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వీరిని ఎన్సీబీ విచార‌ణ‌కు పిల‌వ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

 

 

 

ఇక ఈ కేసులోనే మ‌న టాలీవుడ్‌లో స్టార్స్ ప‌క్క‌న న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా మ‌రోసారి వినిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆమె త‌న పేరు మీడియాలో రావ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించినా కూడా జాతీయ మీడియా క‌థ‌నాల్లో మ‌రోసారి ర‌కుల్ కు కూడా స‌మ‌న్లు జారీ అవుతాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

Leave a comment