Moviesబిగ్‌బాస్‌లో ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ స్టార్ట్‌... ఇద్ద‌రు అమ్మాయిలు ఒక అబ్బాయి

బిగ్‌బాస్‌లో ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ స్టార్ట్‌… ఇద్ద‌రు అమ్మాయిలు ఒక అబ్బాయి

బిగ్‌బాస్ హౌస్‌లో ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. అభిజిత్ – మోనాల్ మ‌ధ్య ఇప్ప‌టికే ఏదో న‌డుస్తోంద‌న్న ప్ర‌చారం ప్రారంభ‌మైంది. దీనికి తోడు వీరు సీక్రెట్‌గా గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇక తాజా ఎపిసోడ్లో అభిజిత్ వ‌ద్ద‌న్నా గారాబం చేస్తూ అత‌నికి గోరు ముద్దలు పెడుతూ అదే ప్లేటులో హారిక‌ కూడా భోజ‌నం చేసింది. భోజనం స‌మ‌యంలో అఖిల్ మోనాల్‌కు తినిపించ‌డంతో అభిజిత్ ముఖం వాడిపోయింది.

ఇక అభిజిత్ మోనాల్‌తో మాట్లాడుతూ త‌న‌కు ముగ్గురు గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉండేవార‌ని చెప్పాడు. ఇక మోనాల్ కూడా నాకు కూడా ఒక‌రు ఉండేవార‌ని చెప్పింది. అంత‌లోనే అభిజిత్ నాతో మాట్లాడ‌తాన‌ని ఒట్టేయాల‌ని మోనాల్‌ను అడిగాడు. అందుకు మోనాల్ బ‌దులిస్తూ నువ్వంటే హారిక‌కు ఇష్ట‌మ‌ని చెప్పింది. అవ‌న్నీ కాదు.. నీకు మాత్రం నేను అంటే ఇష్టం లేద‌ని అభిజిత్ అన్నాడు. వెంట‌నే మోనాల్ ఇష్టం లేక‌పోతే నీతో కూర్చొని ఇంత సేపు , ఇన్ని గంట‌లు మాట్లాడ‌తానా ? అని ముసిముసిగా స‌మాధానం ఇచ్చింది.

సో దీనిని బట్టి చూస్తే బిగ్‌బాస్‌లో ఇప్పుడిప్పుడే రిలేష‌న్లు, క‌నెక్ష‌న్లు స్టార్ట్ అవుతున్నాయనిపిస్తోంది. మ‌రి అటు మోనాల్ ఇటు దేత్త‌డి హారిక మ‌ధ్య‌లో అభిజిత్ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ స్టార్ట్ అయితే హౌస్‌లో ఇక ర‌చ్చ రంబోలా మామూలుగా ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news