అతడో బ్యాంక్ ఆఫీసర్.. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. ఆన్లైన్లో ఓ విటుడిని బుక్ చేసుకుని బుక్ అయ్యాడు. హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇలా ఉన్నాయి. వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. తనతో గడిపేందుకు ఎస్ఆర్నగర్ సమీపంలో ఓ బస్తీతో ఉన్న యువకుడిని రు. 5 వేలకు బుక్ చేసుకున్నాడు.
ఆ ఆఫీసర్ బస్తీకి వచ్చి అతడు ఉన్న ఇంట్లో మొదటి అంతస్తుకు వెళ్లాడు. అతడు వికలాంగుడు కావడంతో అతడితో గడిపేందుకు ఇష్టంలేని బ్యాంక్ అధికారి వెనుదిరిగాడు. అయితే తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందే అంటూ వికలాంగుడు గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది. దీంతో ఆ టైంలో మంచినీటి సరఫరా జరుగుతుండడంతో అక్కడ ఉన్న మహిళలు దొంగేమోనని అనుమానించి అధికారిని పట్టుకున్నారు.
వీరు 100కు డయల్ చేయడంతో అక్కడకు చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకుని వీరిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు బ్యాంకు అధికారితో పాటు విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు