Moviesనిహారిక పెళ్లి ఆ హీరోయిన్‌కు భ‌లే క‌లిసొచ్చిందే

నిహారిక పెళ్లి ఆ హీరోయిన్‌కు భ‌లే క‌లిసొచ్చిందే

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె ఓ ఇంటిది అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆమెకు గుంటూరుకు చెందిన జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. అయితే నిహారిక పెళ్లి కుద‌ర‌డానికి ముందే కోలీవుడ్‌లో ఓ ప్రేమ‌క‌థా సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పింది. అయితే ఇప్పుడు నిహారిక పెళ్లి కుద‌ర‌డంతో ఆ ప్రాజెక్టుకు క్యాన్సిల్ చేసుకుంది. దీంతో నిహారిక త‌ప్పుకోవ‌డం మ‌రో హీరోయిన్‌కు ల‌క్కీ ఛాన్స్ చిక్కిన‌ట్ల‌య్యింది.

కోలీవుడ్‌లో స్వాతిని ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ సెల్వ‌న్ హీరోగా తెర‌కెక్కే సినిమా నుంచి నిహారిక త‌ప్పుకోవ‌డంతో ఆ ప్లేసులో మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోవిడ్ -19 కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర విభిన్నంగా ఉంటుంద‌ని , మేఘా ఆకాశ్ స‌రిగ్గా స‌రిపోతార‌ని ద‌ర్శ‌కుడు సూచించ‌డంతో…ఎంపిక చేసిన‌ట్టు నిర్మాత తెలిపారు. వ‌చ్చే నెల‌లో సినిమా షూటింగ్ చేప‌ట్ట‌నున్న‌ట్టు నిర్మాత తెలిపారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news