Moviesవీరాభిమాని మృతి మ‌హేష్ తీవ్ర భావోద్వేగం...

వీరాభిమాని మృతి మ‌హేష్ తీవ్ర భావోద్వేగం…

సూపర్ స్టార్ మహేష్ కి దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కుటుంబానికి త‌న తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ టైం నుంచి కంటిన్యూగా ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. ఆరు ద‌శాబ్దాలుగా ఈ కుటుంబానికి తెలుగు గ‌డ్డ‌పై అభిమానులు ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక మ‌హేష్‌కు భారీ స్థాయిలో అభిమాన సంఘాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు దరిసి సురేష్ బాబు అకస్మాత్తుగా మృతిచెందారు.

త‌న కుటుంబానికి సీనియ‌ర్ అభిమానిగా ఉన్న సురేష్‌బాబు మృతితో క‌ల‌త చెందిన మ‌హేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించ‌డంతో పాటు త‌న సంతాపం తెలిపారు. ఆయ‌న అకాల మ‌ర‌ణం నా హృద‌యాన్ని క‌లిచి వేసింది… ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని పోస్ట్ చేశాడు మ‌హేష్. ఇక ట్విట్టర్‌లో సురేష్‌బాబు మహేష్ తో కలిసి ఉన్న ఫొటో వైర‌ల్ అవుతోంది. సురేష్ కుటుంబానికి‌ మహేష్ తరపున ఆర్థిక సాయం అందనుందని తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news