ఈ సారి బిగ్‌బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. షోలో లేడీస్ డామినేషన్ ఎక్కుగా ఉంది. కావాల్సినంత గ్లామర్ కూడా ఉంది. గతంలో మూడు సీజన్లలో లేనంత గ్లామర్ ఈ సారి హౌస్‌లో ఉంది. అరియానా గ్లోరీ, దేత్తడి హారిక తొలి రోజే కావాల్సినంత గ్లామర్ షో పంచేశారు. ఇద్దరు కూడా కురచ దుస్తులు వేసుకుని ఓ హాట్ సినిమా హీరోయిన్లను మైమరిపించారు. నిజానికి హీరోయిన్గా ఉన్న మోజాల్ గజ్జర్ చాలా ట్రెడిషనల్‌గా ఉన్నా వీరిద్దరు అందాలు చూపించేందుకు పోటీ పడ్డారు.
ఇక అరియానా గ్లోరీ పైన, కింద గోల్డ్ కలర్ కురచ దుస్తులు వేసుకోవడంతో పాటు ఆమె ఏవీలోనే అంతా బోల్డ్ అని చూపించేసింది. తాను అంతా బోల్డ్ మయం ని చెప్పింది. అరియాన విషయానికి వస్తే ఆమె స్వస్థలం హైదరాబాద్, 25 జనవరి 1993లో పుట్టిన ఆమె డిగ్రీ ఫెయిల్. జెమిని కామెడీ యాంకర్ అంటే అందరూ గుర్తు పడతారో లేదో! కానీ రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఆయన మనసు దోచుకున్న యాంకర్ అంటే ఇట్టే గుర్తుపడతారు.
కొద్ది రోజుల క్రితం ఆర్జీవీయే స్వయంగా అరియానా అంటే తనకు ఇష్టమని చెప్పాడు. 2015లో కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే సూపర్ పాపులర్ యాంకర్ అయ్యింది. అందంతోపాటు, వాక్చాతుర్యంతో కుర్రకారు గుండెలను కొల్లగొడుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన ఆమెకు ఆర్జీవీ నుంచి ఫుల్ సపోర్ట్ ఖాయం అంటున్నారు. స్పెషల్ కేటగిరీ కింద ఈమెను నటుడు సోయెల్తో కలిసి ప్రత్యేక గదిలో ఉంచారు