Moviesఅదిరే ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్‌... ఆ జంట్‌, లేడీ కంటెస్టెంట్లు సీక్రెట్...

అదిరే ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్‌… ఆ జంట్‌, లేడీ కంటెస్టెంట్లు సీక్రెట్ రూంలోకి

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ తొలి రోజే బిగ్‌బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. తొలి ఎనిమిది మంది కంటెస్టెంట్ల‌ను నేరుగా హౌస్‌లోకి పంపిన బిగ్‌బాస్ 9, 10 కంటెస్టెంట్ల‌ను మాత్రం హౌస్‌లోకి పంప‌కుండా షాక్ ఇచ్చారు. 9వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ యాంక‌ర్ అరియానా గ్లోరీ, ఇస్టార్ట్ సోహైల్‌ను హౌస్‌లోకి పంప‌కుండా ఓ సీక్రెట్ హౌస్‌లోకి పంపాడు. వీరిద్ద‌రికి ఇది నేబ‌ర్ హౌస్ అట‌. వీరు ఎప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ‌తారు ? వీరు ఇక్క‌డ ఎన్ని రోజుల వ‌ర‌కు ఉంటారు ? అన్న‌ది బిగ్‌బాస్ డిసైడ్ చేస్తారు.

 

బిగ్‌బాస్ చెప్పేవ‌ర‌కు ఇస్మార్ట్ సోహైల్‌, అరియానా గ్లోరీ ఈ సీక్రెట్ రూంలోనే ఉండాలి. వీరికి కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు, వ‌స‌తులు బిగ్‌బాస్ చూసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత గారి వీరు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌రు. ఇక వీరిద్ద‌రు లోప‌ల‌కు ఎంట్రీ ఇవ్వగానే స‌ర‌దాగా ఒక‌రినొక‌రు ఆట ప‌ట్టించుకున్నారు. బోల్డ్ అరియానా కాస్త గ్లామ‌ర్ ట‌చ్‌తోనే ఉంది. ఆమె గ్లామ‌ర్ హౌస్‌కు మ‌రింత స్పెష‌ల్ కానుంది. ఇక వీరికి బిగ్‌బాస్ హౌస్‌లో ఎవ‌రు ఏం చేసేది తెలుస్తుంది.. వీరు సీక్రెట్ రూంలో ఉంటూనే మిగిలిన కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారో చూడొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news