సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటుతోంది. సూపర్ సినిమాతో ప్రారంభమైన ఆమె ప్రస్థానం వరుసగా సౌత్‌లో అన్ని భాషల్లోనూ కంటిన్యూ అయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో దాదాపు అందరూ హీరోలతోనూ నటించిన అనుష్క సౌత్‌ను ఏలేసిందనే చెప్పాలి. బాహుబలి 1,2 సినిమాల తర్వాత ఆమె నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిపోయింది. ఇక ఆమె వయస్సు 40 ఏళ్లకు చేరువ అవుతోంది. ఆమె పెళ్లి గురించి నాలుగైదేళ్లుగా వార్తలు వస్తున్నా ఆమె ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు.
ఓ టాలీవుడ్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నా వాటిపై ఆమె ఎప్పుడూ కాదని.. ఔనని ఆన్సర్ చేయలేదు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారట. అయితే ఇంత ముదరు వయస్సు వచ్చినా కూడా ఆమెకు అరా కొరా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అసలే కెరీర్ చివరి దశలో ఉంది. ఈ టైంలో వస్తోన్న ఒకటి రెండు ఛాన్సులు కూడా యూజ్ చేసుకుంటే ఆమె కెరీర్ మరో రెండు, మూడేళ్లు ఉంటోందన్న ఆశ ఆమెకు ఉందట.
దీంతో అటు సినిమాలు చేయాలా లేక పెళ్లి చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఆమె కొట్టుమిట్టాడుతోందని చెప్తున్నారు. అందుకే ఆమె ఎటూ తేల్చుకోలేక కాస్త ఆందోళనతోనే ఉందట. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ కానుంది.