జ‌గ‌న్‌కు బీజేపీ అస‌లు సిస‌లైన షాక్‌… కీల‌క నేత జంప్‌…!

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బీజేపీ నుంచి అస‌లు సిస‌లైన షాక్ త‌గ‌ల‌నుందా ? ఓవైపు జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా ఉంటున్న‌ట్టు న‌టిస్తోన్న బీజేపీ చాప‌కింద నీరులా మాత్రం వైసీపీకి, జ‌గ‌న్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఎర్త్ పెట్టే ప‌నులే చేస్తోంది. తాజాగా వైసీపీలో ధిక్కార స్వ‌రం వినిపిస్తోన్న న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజును బీజేపీ త‌మ పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వైసీపీ ఇప్ప‌టికే ఎంపీ ర‌ఘు లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి విజ్ఞ‌ప్తి చేసింది. అయితే ఆయ‌న ఈ ఫిర్యాదును లైట్ తీస్కోన్న‌ట్టే క‌నిపిస్తోంది.

 

ఏపీలో బీజేపీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను శ‌ర‌వేగంగా మార్చుకోవాల‌ని డిసైడ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఇత‌ర పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌ల‌ను సైతం త‌మ పార్టీలో చేర్చుకుని స‌రైన షాక్ ఇవ్వాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ లిస్టులో ఎక్కువ మంది టీడీపీ నేత‌లు ఉన్నా కూడా అధికార పార్టీకి చెందిన కీల‌క నేత‌.. అది కూడా ఓ ఎంపీని పార్టీలో చేర్చుకోవ‌డం అంటే అది జ‌గ‌న్‌కు బిగ్ షాకే అనుకోవాలి. ర‌ఘురామ ఇప్ప‌టికే మోదీతో పాటు బీజేపీపై ప్ర‌శంల వ‌ర్షం కురిపిస్తున్నారు. అటు జ‌గ‌న్‌, వైసీపీ ప్ర‌భుత్వాన్ని రాజ‌ధాని విష‌యంలో తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఇక ర‌ఘురామ త్వ‌రలోనే మంచి ముహూర్తం చూసుకుని కాషాయ కండువా క‌ప్పుకోనున్నార‌ని టాక్‌..?

Leave a comment