బ్రేకింగ్‌: టాలీవుడ్ డైరెక్ట‌ర్ మృతి

ఈ యేడాది సినిమా రంగంలో దేశ‌వ్యాప్తంగా అనేక విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ హీరోల నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న యువ హీరోలు సైతం మృతి చెందారు. ఈ విషాదాల నుంచి కోలుకోక ముందే మ‌రో విషాదం టాలీవుడ్‌లో చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎన్‌బి. చ‌క్ర‌వ‌ర్తి మృతిచెందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మృతి చెందారు.

 

సంపూర్ణ ప్రేమాయ‌ణం, క‌త్తుల కొండ‌య్య‌, నిప్పులాంటి మనిషి, కాష్మోరా వంటి సినిమాల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్‌.బి. చ‌క్ర‌వ‌ర్తి నిన్న‌టి త‌రంలో మంచి డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. సంపూర్ణ రామాయ‌ణంలో శోభ‌న్‌బాబు హీరో. ఇక క‌త్తుల కొండ‌య్య నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు టాలీవుడ్ పెద్ద‌లు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.

Leave a comment