షాకింగ్ ‌: చిరంజీవి ఇంట్లో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌..

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి కుటుంబంతో పాటు ద‌ర్శ‌కుడు తేజ‌, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. సింగ‌ర్లు స్మిత‌తో పాటు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం సైతం క‌రోనా భారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఏకంగా న‌లుగురికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా మీడియాతో పంచుకున్నారు.

 

ప్లాస్మా అవగాహన సదస్సులో చిరంజీవి మాట్లాడుతూ మా ఇంట్లో పనిచేసే వంట మనిషి శ్రీను, కూరగాయలు తరిమే మహిళ, వంట మనిషి కొడుకు, స్విమ్మింగ్ పూల్ కడిగే లక్ష్మణ్ కరోనా భారిన పడ్డారు. వాళ్లను వెంటనే క్వారంటైన్‌కు పంపించి చికిత్స అందించాం. నెలన్నర క్రితమే వాళ్ళు కోలుకున్నార‌ని చిరంజీవి చెప్పారు. ఇక వాళ్ల‌కు రెండు సార్లు నెగిటివ్ వ‌చ్చాకే తిరిగి మ‌ళ్లీ ఇంట్లో ప‌ని చేస్తున్నార‌ని చిరు చెప్పారు. వాళ్లు కూడా ప్లాస్మా దానం చేశార‌ని చిరు చెప్పారు. చిరు ఇంట్లో న‌లుగురికి క‌రోనా వార్త అని తెలుసుకున్న ఫ్యాన్స్ కాస్త ఆందోళ‌న చెందినా అది నెల రోజుల క్రితం వార్త అని తెలియ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment