బ్రేకింగ్‌: జ‌గ‌న్ జెండా ఆవిష్క‌ర‌ణ‌లో అప‌శృతి… షార్ట్ స‌ర్క్యూట్‌, పొగ‌లు

విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మ‌నిసిప‌ల్ స్టేడియంలో జ‌రుగుతోన్న ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్ సహా ఇతర ఉన్నతాధికారులతో పాటు ఏపీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కొంద‌రు ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. ఇక జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి సాయుధ ద‌ళాల గౌర‌వ వందనం కూడా స్వీక‌రించారు. ఇక ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించి.. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.

 

అయితే వేడుక‌లు జ‌రుగుతోన్న వేళ చిన్న అప‌శృతి చోటు చేసుకుంది. వేడుక‌ల‌ సందర్భం గా ఆడియో స్పీకర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆడియో స్పీకర్ నుండి పొగలు రావడంతో అధికారులు ఒక్క‌సారిగా స్టేడియంలో ఆందోళ‌న చెల‌రేగింది. అధికారులు, నేత‌లు అంద‌రూ కంగారుప‌డ్డారు. వెంట‌నే అక్క‌డ సిబ్బంది దానిని స‌రిచేసి ప‌రిస్థితి అదుపులోకి తీసుకువ‌చ్చారు.

Leave a comment