ఆమె కోసం రు 4.5 కోట్ల‌తో ప్లాట్ కొన్న సుశాంత్‌… ఆమె ఎవ‌రంటే…!

దివంగ‌త బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డి ఆత్మ‌హ‌త్య‌పై జ‌రుగుతోన్న విచార‌ణ‌లో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోన్న కొద్ది స‌రికొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియాను విచారించ‌గా అనేక కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సుశాంత్ మాలాడ్‌లో రు 4.5 కోట్ల‌తో విలువైన ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తేలింది. ఇంకా ప్లాట్‌లోనే అంఖితా లోఖాండే నివ‌సిస్తున్న‌ట్టు ద‌ర్యాప్తులో తేలిందంటున్నారు.

 

ఈ ప్లాట్ కోసం సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ ఎంత ఇచ్చాడ‌న్న‌ది తెలియ‌న‌ప్ప‌ట‌కి.. ఇంకా కొన్ని ఈఎంఐలు మిగిలే ఉన్నాయంటున్నారు. అయితే ఈ ప్లాట్‌కు సంబంధించి ప్ర‌తీ ఈఎంఐ కూడా సుశాంతే చెల్లించేవాడ‌ని టాక్‌. ఇక సుశాంత్ అక్కౌంట్‌ను రియా తారుమారు చేసింద‌న్న దానిపై సైతం ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది.

Leave a comment