Politicsఏసీబీ చ‌రిత్ర‌లోనే రికార్డు... 1. 10 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా...

ఏసీబీ చ‌రిత్ర‌లోనే రికార్డు… 1. 10 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన త‌హ‌సీల్దార్‌

ఏబీసీ చ‌రిత్ర‌లోనే ఓ స‌రికొత్త రికార్డు న‌మోదు అయ్యింది. ఏ అవినీతి అన‌కొండ అయిన త‌హ‌సీల్దార్ ఏకంగా రు 1.10 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. తెలంగాణ‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, కీసర మండలం రాంపల్లి దాయర సర్వే నెంబర్లు 604 నుంచి 614 వరకు పూర్వీకుల నుంచి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఇక మిగిలిన 28 ఎక‌రాల భూవివాదంపై రైతులు పోరాటాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది కోర్టులో ఉంది.

 

దీనిపై ఓ రియల్ ఎస్టేట్ సంస్థ క‌న్ను ప‌డ‌డంతో దీనిని చ‌క్క బెట్టే బాధ్య‌త‌ను ఓ పార్టీకి చెందిన‌ సీనియర్ నేత అనుచరుడు కీసరకు చెందిన అంజిరెడ్డి, ఉప్పల్ కు చెందిన దళారి శ్రీనాధ్ తీసుకున్నారు. తప్పుడు పత్రాలతో పాసు పుస్తకాలు ఇప్పించేందుకు చక్రం తిప్పారు. ఇందుకు సాయం చేస్తే భారీ మొత్తం లంచంగా ఇస్తామ‌ని కీస‌ర త‌హ‌సీల్దార్ నాగ‌రాజుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

 

ఈ క్ర‌మంలోనే త‌హ‌సీల్దార్ ఇంటికి అంజిరెడ్డి, శ్రీనాథ్‌ శుక్రవారం సాయంత్రం వచ్చారు. అప్పటికే పిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు నాగరాజ్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. తహశీల్ధార్ ఇంట్లో మరో రూ. 25లక్ష్లలు దొరికాయి. సో ఇలా ఏసీబీ చ‌రిత్ర‌లోనే ఈ మొత్తం పెద్ద రికార్డుగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news