ప్ర‌ధాని మోదీకి హానీ చేస్తామంటూ బెదిరింపులు…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకే హానీ త‌ల‌పెడ‌తానంటూ ఓ యువ‌కుడు బెదిరింపు వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. పైగా ఆ య‌వ‌కుడు పోలీస్ ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ 100కు ఫోన్ చేసి మ‌రీ వార్నింగ్ ఇచ్చాడు. యూపీలోని నోయిడాలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. స‌ద‌రు యువ‌కుడికి మ‌తిస్థితితం లేన‌ట్టుగా తెలుస్తోంది. మోదీకే వార్నింగ్ ఇవ్వ‌డంతో వెంట‌నే పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. దీంతో పోలీసులు స‌ద‌రు యువ‌కుడిని ట్రేస్ చేసి ప‌ట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

 

హ‌ర్యానాకు చెందిన యువ‌కుడు హర్‌భజన్ సింగ్ అనే యువకుడు నోయిడాలో నివాసముంటున్నాడు. డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డిన స‌ద‌రు యువ‌కుడు 100 పోలీస్ ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్‌కు ఫోన్ చేసి తాను ప్ర‌ధాని మోదీకే హానీ త‌ల‌పెడుతున్నానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ముందుగా ఇది ఏ ఉగ్ర‌వాదుల చ‌ర్యో అని కంగారు ప‌డ్డ పోలీసులు రంగంలోకి దిగి… నోయిడా ఫేజ్ 3 పోలీసులు నిందితుడైన హర్‌భజన్ సింగ్ ను పట్టుకున్నారు. అత‌డిని ప్ర‌శ్నించిన స‌మ‌యంలో అత‌డి మానసిక స్థితి స‌రిగా లేద‌ని వెల్ల‌డైంది.

Leave a comment