సినిమా ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా విషాదం… నిర్మాత మృతి

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి సినిమా వాళ్ల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, హీరోయిన్లు, జూనియ‌ర్ ఆర్టిస్టులు క‌రోనా భారీన ప‌డుతున్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు మృతి చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌రో నిర్మాత‌ను బ‌లి తీసుకుంది. కోలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి లక్ష్మీ మూవీ మేకర్స్‌. కె మురళీధరన్, స్వామినాథన్, వేణుగోపాల్ అనే ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ బ్యాన‌ర్ స్టార్ట్ చేశారు.

 

ఈ బ్యాన‌ర్‌పై తొలిసారిగా 1994లో అరణ్‌ మనై కావలన్‌ అనే సినిమా నిర్మించారు. ఆ తర్వాత గోకులంలో సీతై, ప్రియముడన్, భగవతి, అన్బే శివం తదితర పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చివరగా ఈ సంస్థ జయం రవి హీరోగా సకల కళా వల్లవన్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన స్వామినాథన్‌కు ఇటీవ‌ల క‌రోనా సోకింది. ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందారు. ఆయ‌న మృతికి కోలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

Leave a comment