ఎన్టీఆర్ మ‌రో సంచ‌ల‌నం… ఈ సారి పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ బెంబేలే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ సారి పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం క్రియేట్ చేస్తున్నాడా ? అంటే లాక్‌డౌన్ వేళ జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ఇది కంప్లీట్ అయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ సినిమాకు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ మంచి విజ‌యం సొంతం చేసుకుంది.

 

దీంతో వీరి కాంబోలో రెండో సినిమాగా వ‌స్తోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ సినిమాను లాక్ చేసిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడ‌ని గ‌త రెండేళ్లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం కేజీఎఫ్ – 2 సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న ప్ర‌శాంత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్‌తో చేసే పాన్ ఇండియా సినిమా క‌థ‌పై మ‌రింత క‌స‌ర‌త్తులు చేస్తాడ‌ట‌.

 

ఈ సినిమా ఏకంగా రు. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని… మైత్రీ మూవీస్ ఎన్టీఆర్ క్రేజ్ – ప్ర‌శాంత్ నీల్ స్టామినాపై న‌మ్మ‌కం ఉంచి.. అంత బ‌డ్జెట్ పెడ‌తోంద‌ని అంటున్నారు. ఏకంగా పాన్ ఇండియా స్తాయిలో ఐదారు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ భారీగా ఉండ‌బోతోంద‌ట‌. ఆర్ ఆర్ ఆర్‌తో ఎలాగూ ఎన్టీఆర్‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రేజ్ ఉంటుంది.. ఆ సినిమా త‌ర్వాత ఈ పాన్ ఇండియా సినిమా వ‌స్తే ఎన్టీఆర్ ఇమేజ్ ఆకాశంలో ఉండ‌డం ఖాయం. త్వ‌ర‌లోనే సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా త్వరలో ఓ బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.

Leave a comment