బ్రేకింగ్‌: మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టికే కేసులు రోజు రోజుకు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, సెల‌బ్రిటీలు కూడా క‌రోనా భారీన ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి సైతం క‌రోనా భారీన ప‌డ్డారు. కొద్ది రోజులుగా ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా ఆయ‌న‌కు క‌రోనా ఉన్నట్టు నిర్దార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్‌కు వెళ్లిపోయారు.

Leave a comment