బ్రేకింగ్‌: ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీల‌ను పొట్ట‌న పెట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖులు క‌రోనా పాజిటివ్‌కు గురై కోలుకున్నారు. వీరిలో కొంద‌రు కోలుకుంటుంటే .. మ‌రి కొంద‌రు చ‌నిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కొద్ది రోజు క్రితం క‌రోనా సోక‌క‌గా చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో వెంటిలేట‌ర్‌పై ఉండి చికిత్స అందిస్తున్నారు.

 

తాజాగా ఆయ‌న భార్య‌కు సైతం ఇప్పుడు క‌రోనా పాజిటివ్ సోకిన‌ట్టు తెలుస్తోంది. బాలు సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ భారిన పడ్డారు. బాలసుబ్రహ్మణ్యం పాజిటివ్ రావడతో కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించారు. ఆమె కూడా బాలుతోనే ఉండ‌డంతో పాటు స‌ప‌ర్యలు చేస్తుండ‌డంతో ఆమెకు కూడా క‌రోనా సోకింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది.

Leave a comment