బిగ్‌బాస్ 4 ఈ కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే బోరు బోరు… ఇంత అవుట్ డేటెడ్ వాళ్ల‌తో షోనా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ రియాల్టీ షో అయిన బిగ్‌బాస్ తెలుగు వెర్ష‌న్ 4 సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. తెలుగులో ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్త‌య్యాయి. మూడో సీజ‌న్ హోస్ట్‌గా ఉన్న నాగార్జునే నాలుగో సీజ‌న్‌కు సైతం హోస్ట్‌గా రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ప్రోమోగ‌ల‌తో బిగ్‌బాస్ 4 పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. బిగ్‌బాస్ 4లో పాల్గొనే వారి పేర్లు ఇప్ప‌టికే వెలుగులోకి వ‌స్తున్నాయి. అయితే ఈ లిస్ట్ చూస్తే మాత్రం షాక్ అవ్వ‌క‌త‌ప్ప‌దు.

 

ఈ నాలుగో సీజ‌న్ కంటెస్టెంట్లు అంటూ లీక్ అయిన లిస్ట్ చూస్తే వాళ్లంతా సినిమాల్లో…. సీరియల్స్ లో అవకాశాలు కోల్పోయినవారే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా నేప‌థ్యంలో కొంద‌రు సెల‌బ్రిట‌లు ఇన్ని రోజుల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవడంతో వారు ఈ షోలో పాల్గోలేమ‌ని చెప్పేశార‌ట‌. దీంతో సీరియ‌ల్స్‌, సినిమాల్లో అవ‌కాశాలు లేని వారితోనే షో ర‌న్ చేస్తూ చాలా వ‌ర‌కు బోర్ కొట్టే ప్ర‌మాదం ఉంద‌న్న కామెంట్లు కూడా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి.

 

వెండితెరపై అటు బుల్లితెరపై హవా తగ్గిపోయిన వారు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడుతున్నారని… వీళ్లల్లో కొంద‌రు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల దృష్టిలో అవుట్ డేటెడ్ అయిపోయారని.. వీరితో షో కు ఎంత వ‌ర‌కు క‌ళ వ‌స్తుంద‌న్న‌ది సందేహ‌మే అన్న చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి.

Leave a comment