Politicsఅమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త మ‌హిళ‌... త‌మిళ‌నాడు టు అగ్ర‌రాజ్యం

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త మ‌హిళ‌… త‌మిళ‌నాడు టు అగ్ర‌రాజ్యం

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌బోతోన్న భార‌తీయ సంత‌తి మ‌హిళ క‌మ‌లా హారీస్ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేయ‌నుంది. ఆమెకు అగ్ర‌రాజ్యం ఎన్నిక‌ల్లో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఎన్నిక‌లు న‌వంబ‌ర్‌లో జ‌రుగుతుండ‌గా… డెమోక్రాట్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌వ‌నున్న జో బిడెన్‌.. ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి క‌మ‌లా హారీస్‌ను ఎంపిక చేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు. ప్ర‌స్తుతం క‌మ‌లా హారీస్ డెమోక్రాట్ పార్టీ త‌ర‌పున సెనేట‌ర్‌గా ఉన్నారు. ఆమె జో బిడెన్‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా కూడా ఉన్నారు.

 

ఇక క‌మ‌లా హారీస్‌ను ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన బిడెన్‌ తామిద్దరం కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించబోతున్నామన్నారు. కుప్ప‌కూలి నాశ‌నం అయిపోయిన అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు త‌న క‌మ‌లా హారిస్ స‌రైన భాగ‌స్వామి అని ఆయ‌న చెప్పారు. ఇక డెమోక్రాట్ల త‌ర‌పున ఉపాధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఎంపిక అయిన కమలా హారిస్‌ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. కమలా హారిస్‌ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్‌ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news