బిగ్‌బాస్ 4 ఫ్యాన్స్‌కు బిగ్ బ్యాడ్ న్యూస్‌

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్ బాస్ ఇప్పటికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు కంప్లీట్ చేసుకుంది. నాలుగో సీజ‌న్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా ? అని అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ మూడు సీజ‌న్ల‌లో తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా… రెండో సీజ‌న్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో సీజ‌న్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేశారు. ఇక నాలుగో సీజ‌న్ క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే వాయిదా ప‌డింది. ఈ సీజ‌న్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నాలుగో సీజ‌న్లో పాల్గొనే కంటెస్టెంట్ల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, మంజూషలతో పాటు నందు, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష, కొరియోగ్రాఫర్ రఘు, మంగ్లీ, నోయల్, ప్రియా వడ్లమాని పేర్లు కూడా వినబడుతున్నాయి.

 

నాలుగో సీజ‌న్ కోసం ఎంతో ఆశ‌తో వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే బ్యాడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా కార‌ణంగా ఈ నాలుగో సీజ‌న్ రూల్స్‌లో అనేక నిబంధ‌న‌లు పెడుతున్నారు. కంటెస్టెంట్లు ముందుగా 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.. ఆ త‌ర్వాత వీరికి క‌రోనా పరీక్ష‌లు చేశాక‌.. నెగిటివ్ వ‌స్తేనే హౌస్ లోప‌ల‌కు పంపుతార‌ట‌. ఇక ఇవ‌న్నీ చేయ‌డానికి మ‌రి కాస్త టైం ప‌ట్టేలా ఉండ‌డంతో ఈ షో అనుకున్న టైంకు ప్రారంభం కాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. షో బుల్లితెర పాపుల‌ర్ షో ఎంజాయ్ చేసేందుకు మ‌రి కొంత స‌మ‌యం ప‌ట్ట‌క త‌ప్ప‌ద‌న్న మాట‌.

Leave a comment