ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలం నడుస్తోంది. ఈ కష్టకాలంలో కూడా చాలా మంది తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఉదాహరణకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం భారీగా రెమ్యునరేషన్లు తగ్గించుకుంటున్నారు. వీరిలో స్టార్ హీరోల నుంచి హీరోయిన్లతో పాటు సంగీత దర్శకులు, ఇతర టెక్నీషియన్లు ఉంటున్నారు. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు సైతం రెమ్యునరేషన్లు తగ్గించుకుంటున్నా మన టాలీవుడ్ యాంకర్ల రేట్లు మాత్రం చుక్కల్లోనే ఉంటున్నాయి.
ఈ కరోనా కష్టకాలంలో కూడా వీరు రేట్లు తగ్గించుకోవడం లేదు సరికదా ? తాము అడిగినంత ఇస్తేనే షోలు చేస్తామని కొండెక్కి కూర్చుంటున్నారట. మన తెలుగు యాంకర్ల మేకప్ ఖర్చులు, టీ, టిఫిన్లు, జ్యూస్‌ల ఖర్చులు కూడా రెమ్యునరేషన్‌కు అదనం. ఇక యాంకర్ల రేట్లు పరిశీలిస్తే సుమ ఏకంగా ఒక్కో షోకు రు. 2 నుంచి రు. 2.5 లక్షల వరకు తీసుకుంటోందట. ఇక వర్షిణి, మంజూషల షోలు పెద్దగా క్లిక్ కావడం లేదు.. వీళ్ల షోలకు రేటింగులు కూడా డల్‌గా ఉంటున్నాయి.
ఈ క్రమంలోనే వీరు ఒక్కో షోకు రు. 30 వేలు వరకు ఛార్జ్ చేస్తున్నారట. వీరికి అంతకు మించి సీన్ లేదంటున్నారు. ఇక శ్యామల రు. 50 వేలకు తగ్గే పరిస్థితి లేదని చెపుతోందట. ఇక అనసూయ 2 లక్షలు, రష్మీ 1.5 లక్షలు తీసుకుంటారట. శిల్పా చక్రవర్తి, గాయత్రి భార్గవి రు. 2 లక్షలు తీసుకుంటున్నట్టు టాక్..? ఇక పురుష యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు, సుధీర్ రు. 2 లక్షల వరకు తీసుకుంటున్నట్టు టాక్.. ? ఇక రవి, శ్రీముఖి కూడా రు. 2 లక్షలకు తగ్గేది లేదని చెపుతున్నారట.