Politicsకంచుకోటలో పుంజుకున్న టీడీపీ...నిలబెట్టేశారు...!

కంచుకోటలో పుంజుకున్న టీడీపీ…నిలబెట్టేశారు…!

కృష్ణా జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిచేది. 2014లో సైతం టీడీపీ జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో 16 సీట్లు ఉంటే టీడీపీ 10, బీజేపీ 1, వైసీపీ 5 స్థానాలు గెలుచుకుంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

 

జగన్ వేవ్‌లో టీడీపీ కేవలం 2 సీట్లే గెలిచింది. వైసీపీ 14 సీట్లు కైవసం చేసుకుంది. ఇక ఎన్నికలై ఏడాది దాటడంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. కొందరు నేతలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ముఖ్యంగా అమరావతి రాజధానికి మద్ధతుగా ఉద్యమించడం టీడీపీకి కలిసొచ్చింది. జిల్లాలో మెజారిటీ ప్రజలు మూడు రాజధానులని వ్యతిరేకించడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు నెగిటివ్ అవుతుంది.

 

టీడీపీ తరుపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. ఇక టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఓడిపోయిన నేతల్లో వేగంగా పుంజుకున్న నేతల్లో బోండా ఉమా ముందు వరుసలో ఉంటారు. మొన్న ఎన్నికల్లో ఈయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి కేవలం 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో ఉమా బలం పుంజుకున్నారు.

 

అటు పెనమలూరులో ఓడిపోయిన బోడే ప్రసాద్ సైతం బలపడినట్లు తెలుస్తోంది. ఇక తిరువూరులో మాజీ మంత్రి కే‌ఎస్ జవహర్ పరిస్థితి కూడా మెరుగు పడినట్లే కనబడుతోంది. ఇక రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న మైలవరంలో దేవినేని ఉమా కూడా ప్రజల మద్ధతు తిరిగి తెచ్చుకున్నారు. అటు నందిగామ, జగ్గయ్యపేటల్లో టీడీపీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కంచుకోటలో టీడీపీ బాగానే పుంజుకున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news