బిగ్‌బాస్ 4 ప్రోమో… ముస‌లి లుక్‌తో మైండ్ దొబ్బేలా చేసిన నాగార్జున‌

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ నెలాఖ‌రు నుంచి బిగ్‌బాస్ 4 సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్టైన్‌మెంట్ ల‌భించ‌నుంది. ఈ షోకు సంబంధించి ఇప్ప‌టికే ఒక్కో ప్రోమో విడుద‌ల అవుతోంది. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్‌కు సంబంధించిన స్టిల్ బ‌య‌ట‌కు రాగా… తాజాగా నాగార్జున లుక్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఆయన ముసలి వ్యక్తిలా కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు గోపి అంటూ చిన్న నవ్వు నవ్వారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి.

 

గ‌త సీజ‌న్లో నాగార్జున చేతి వేలికి ఒక కోతి బొమ్మ‌ను ప‌ట్టుకుని దాంతో అనేక విష‌యాలు మాట్లాడుతూనే హోస్టింగ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ ముసలి గెట‌ప్‌తో పాటు గోపీ అన‌డంతో గోపీగా ఎవ‌రిని ప‌ట్టుకు వ‌స్తారు ? అన్న ఆస‌క్తి స్టార్ట్ అయ్యింది. సీజన్‌3లో టిప్ టాప్‌గా రెడీ అయి వచ్చిన నాగార్జున ఈ సారి ముసలి గెటప్‌లో దర్శనమిచ్చాడేంట్రా అని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. నెక్ట్స్ ప్రోమోలో దీనికి సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు రిలీజ్ కానున్నాయ‌ట‌.

Leave a comment